ఆరోసారి బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ పోటీ.. ఈసారి పోటీలో గెలుపెవరిదో?

frame ఆరోసారి బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ పోటీ.. ఈసారి పోటీలో గెలుపెవరిదో?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఆ పోటీ హాట్ టాపిక్ అవుతుంది. బాలయ్య, రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఐదుసార్లు పోటీ పడిన సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన ఆదిత్య 369, రవితేజ నా ఆటోగ్రాఫ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం గమనార్హం. ఆరోసారి బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారని సమాచారం అందుతోంది.
 
బాలయ్య, రవితేజ సినిమాలలో ఏ సినిమా కలెక్షన్ల విషయంలో సత్తా చాటుతుందేమో చూడాల్సి ఉంది. 2008 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ వద్ద ఐదుసార్లు పోటీ పడ్డారు. అయితే స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ కావడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేకపోయినా రీరిలీజ్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
 
ఏప్రిల్ నెల 4వ తేదీన ఆదిత్య 369, నా ఆటోగ్రాఫ్ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లన్ సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు రీరిలీజ్ అవుతున్నా ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ అయితే జరగడం లేదు. ఆదిత్య 369, నా ఆటోగ్రాఫ్ ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాల్సి ఉంది.
 
బాలయ్య, రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఆ పోటీ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. భవిష్యత్తులో ఈ స్టార్ హీరోల స్ట్రెయిట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య రెమ్యునరేషన్ 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా రవితేజ పారితోషికం మాత్రం 25 కోట్ల రూపాయల స్థాయిలో ఉందని భోగట్టా. బాలయ్య, రవితేజ భారీ విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: