హీరోయిన్ సుహాసిని చెల్లెలు కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా.. ఎవరంటే..?

frame హీరోయిన్ సుహాసిని చెల్లెలు కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా.. ఎవరంటే..?

Divya
టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్స్ గా పేరు సంపాదించిన వారిలో సుహాసిని కూడా ఒకరు. పలు చిత్రాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా ఆ తర్వాత చాలా చిత్రాలలో అక్కగా, అమ్మగా, అధికారిగా కూడా నటించింది. తెలుగులో సుహాసిని 50 పైగా చిత్రాలలో నటించిన ఆ తర్వాత మలయాళ, తమిళం వంటి భాషలలో కూడా నటించి మెప్పించింది. అయితే సుహాసిని కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా కూడా ఎంతో ప్రతిభను చాటుకున్నదట. ఈమె భర్త ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం అన్న సంగతి తెలిసిందే.

ఇదంతా ఇలా ఉంటే హీరోయిన్ సుహాసిని చెల్లి కూడా టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు.. అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతోందట. ఆమె ఎవరో కాదు కమలహాసన్ కూతురు శృతిహాసన్.. శృతిహాసన్, సుహాసిని వరుసకు అక్క చెల్లెలు అవుతారట. సుహాసిని తండ్రి కమల్ హాసన్ ఇద్దరూ కూడా సొంత అన్న తమ్ముళ్లట. అందుకే వరుసకు శృతిహాసన్, సుహాసిని అక్కాచెల్లెళ్ళు అవుతారని తెలుస్తోంది.

హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో రాణిస్తోంది. ప్రస్తుతం శృతిహాసన్ కెరియర్ విషయానికే వస్తే సలార్ 2 చిత్రంలో నటిస్తే ఉన్నది. శృతిహాసన్ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ తన పర్సనల్ లైఫ్ విషయాలకు సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక నటి సుహాసిని ఈ మధ్యకాలంలో చాలా తక్కువ చిత్రాలలో కనిపిస్తోంది. కమలహాసన్ పలు చిత్రాలలో నటిస్తూ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డైరెక్టర్ మణిరత్నం కూడా ఇప్పుడు రకాల చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. మొత్తానికి శృతిహాసన్ సుహాసిని అక్కచెల్లెళ్ల అవతారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: