చంద్రబాబే సీఎం కావాలని కోరుకుంటున్న పవన్.. ఆ కల నెరవేరడం కష్టమేనా?

frame చంద్రబాబే సీఎం కావాలని కోరుకుంటున్న పవన్.. ఆ కల నెరవేరడం కష్టమేనా?

Reddy P Rajasekhar
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఏ స్థాయిలో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సీఎం కావడం అభిమానుల ఆకాంక్ష, కల అనే సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా బిజీగా ఉండగా పవన్ సినిమాలు పూర్వవ్వడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయనే సంగతి తెలిసిందే.
 
అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబే భవిష్యత్తులో మరో పదేళ్లు సీఎం కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబుతో పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ తన కామెంట్ల ద్వారా చెప్పకనే చెబుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ కు సంబంధించి ఒకింత గందరగోళం నెలకొందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పిన ప్రకారం హరిహర వీరమల్లు మూవీ మే నెల 9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది.
 
అయితే ఆ తేదీకి ఈ సినిమా రిలీజ్ కావడం సాధ్యమేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ సినిమాలలో నటించగా ఆ సినిమాల షూటింగ్ కొంత భాగం బ్యాలెన్స్ ఉంది, పవన్ డిప్యూటీ సీఎం కావడం వల్ల సినిమాల షూటింగ్స్ కు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారో లేదో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: