
ఆ విషయంలో ఎన్టీఆర్ పెద్ద కొడుకు - పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా సేమ్ టు సేమ్..ఎవ్వడిని తీసిపడేయలేం..1
కొంతమంది మాత్రం నాన్న హీరో తాత తోపైన హీరో అంటూ రకరకాలుగా సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో వాడేస్తూ ఉంటారు . కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీర ని చూస్తే మాత్రం సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పాలి. నాన్న పెద్ద పవర్ స్టార్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కూడా . కానీ ఇంతకూడా హెడ్ వెయిట్ లేకుండా చాలా సాదాసీదాగా తిరుగుతూ ఉంటాడు . ఆయన సింప్లిసిటీ ముందు మిగతా ఏ స్టార్ హీరోలు పనికిరారు అనే చెప్పాలి .
ఎంతలా అంటే బయట ఎవరైనా కనిపించి ఫొటోస్ అడిగినా కూడా చాలా సిగ్గుతో వద్దు వద్దు అని చెప్తూ ఉంటాడు. ఒక పవర్ స్టార్ కొడుకు ఇలా ఈ విధంగా ఉండడం జనాలకి ఆశ్చర్యకరంగా అనిపించింది . అయితే పవన్ కళ్యాణ్ కొడుకు లాగే సేమ్ టు సేమ్ బిహేవ్ చేస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ . అభయ్ రామ్ కూడా చాలా చాలా షై ఫీలింగ్ గల పర్సన్ . ఎక్కడైనా సరే ఫంక్షన్స్ కి వెళ్ళినా ఫొటోస్ దిగమన్నా ఇష్టపడడు అంట. నలుగురితో మింగిల్ అవ్వాలన్నా సిగ్గుపడుతూ ఉంటాడు. అలా అకిరానందన్ . అభయ్ రామ్ సేమ్ క్వాలిటీస్ గలవారు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా అభయ్ రామ్ స్టడీస్ లో తోపైనా.. ఇంట్రాక్టివ్ విషయంలో మాత్రం అస్సలు జూనియర్ ఎన్టీఆర్ కి దరిదాపుల్లో కూడా లేడు . జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా టాకెటివ్ కాని జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ మాత్రం చాలా సైలెంట్ పర్సన్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..!