ఆమె ఫోన్ కాల్స్.. నన్ను భయపెడతాయి అంటున్న అభిషేక్ బచ్చన్ ..!

frame ఆమె ఫోన్ కాల్స్.. నన్ను భయపెడతాయి అంటున్న అభిషేక్ బచ్చన్ ..!

Divya
బాలీవుడ్లో స్టార్ కపుల్ గా పేరుపొందిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంట బాలీవుడ్ లోనే ప్రత్యేకమని చెప్పవచ్చు. వివాహమై ఇప్పటికే ఎన్నో ఏళ్లు అవుతూ ఉన్న ఇప్పటికి ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. ఎలాంటి విమర్శలకు స్థానం కల్పించకుండా పేరు సంపాదించారు ఈ జంట. అలాంటిది తాజాగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే అభిషేక్ బచ్చన్ నటించిన ఐవాంట్ టు టాక్ చిత్రానికి ఉత్తమ నటుడుగా అవార్డును కూడా అందుకున్నారు.

ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ ఉత్తమ నటుడుగా తాను అవార్డు అందుకున్న మొదటి చిత్రం ఇది అని ఇందుకు  అర్హుడని.. భావించినటువంటి ఈ కార్యక్రమం నిర్వాహకులకు , అలాగే అభిమానులకు తన ధన్యవాదాలు అని అలాగే డైరెక్టర్ సుజిత్ సర్కారు వల్లే ఈ చిత్రంలో తన తండ్రి పాత్ర చాలా అద్భుతంగా చేయగలిగాను అంటూ తెలియజేశారు అభిషేక్ బచ్చన్. అందుకే ఈ పూర్తి క్రెడిట్ అంతా కూడా ఆయనకే దక్కాలని తెలియజేశారు అలాగే తోటి నటీనటులు సైతం తనని ఎంతో స్ఫూర్తి పొందేలా చేశారని తన తోటి వారి నటన చూసిన తర్వాత తాను చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.

అయితే ఇంతలో అక్కడే ఉన్న అర్జున్ కపూర్ తాను నేను మీతో మాట్లాడాలి అంటూ.. ఒక ప్రశ్న వేయగా ఎవరి ఫోన్ చేస్తే మీరు కంగారు పడిపోతారు అంటూ ప్రశ్నించగ? అందుకు అభిషేక్ నవ్వుతూ నీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు ఇలా అడుగుతున్నావు ఒకవేళ నీకు పెళ్లి అయ్యి ఉంటే ఈ ప్రశ్నకు నీవద్దె సమాధానం ఉండేది అంటూ వెల్లడించారు.. భార్య ఫోన్ చేసి నేను మీతో మాట్లాడాలి అంటే అప్పుడు మొదలవుతుంది గందరగోళం అని తెలియజేశారు అభిషేక్ బచ్చన్ . అలా మొత్తానికి ఐశ్వర్యరాయ్ ఫోన్ చేస్తే దాని భయపడి పోతానంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: