
సూర్య మూవీ లేటెస్ట్ అప్డేట్ .. 500 మంది అదిరిపోయే స్కెచ్..!
ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది . ఈ సినిమా ఓ డిఫరెంట్ స్టోరీ తో రాబోతుంది .. అలాగే సూర్య కెరియర్ లో 45 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహమాన్ ను యూనిట్ ఓకే చేసింది .. రెహమాన్ మ్యూజిక్ సినిమాకి మరింత హైప్‌ను తెచ్చిపెట్టబోతుంది .. అలాగే ఈ ప్రాజెక్టు గురించి 2024 అక్టోబర్ 14న ఈ సినిమాపై అధికార ప్రకటన వచ్చింది .. ఆర్జే బాలాజీ గతంలో రన్ బేబి రాన్ వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో నటుడిగా దర్శకుడుగా తన సత్తా చాటాడు ..
అలాగే నయనతారతో ఆయన చేసిన అమ్మోరు తల్లి సినిమా మంచి విజయం అందుకుంది .. ఇక ఇప్పుడు సూర్య తో ఆర్జే బాలాజీ కాంబినేషన్ పై సినీ ప్రియులో మంచి ఆసక్తి ఉంది.. అయితే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ఎంతో భిన్నమైన స్టోరీ తో రాబోతుందట . అలాగే ఈ సినిమాలు త్రిష హీరోయిన్గా నటిస్తుంది .. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది .. ఫెస్టివల్ సెట్ లో ఈ సినిమా పాటను తెరకెక్కిస్తున్నారు .. త్రిష - సూర్య కలిసి ఈ జానపద పాటకు డాన్స్ చేస్తారని కూడా అంటున్నారు . అలాగే ఈ పాటలో 500 మందికి పైగా డాన్సర్స్ ఉంటారని తెలిసింది . అలాగే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.