తండ్రి బ్యాట్మెంటన్ ప్లేయర్ . కూతురు పాన్ ఇండియా స్టార్ .. ఈ చిన్నారి ఎవరంటే..?

frame తండ్రి బ్యాట్మెంటన్ ప్లేయర్ . కూతురు పాన్ ఇండియా స్టార్ .. ఈ చిన్నారి ఎవరంటే..?

Amruth kumar
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నది ఎవరో కనిపెట్టారా ? తండ్రి ఒడిలో ఉన్న ఈ బుజ్జి పాప ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ .. సౌత్ అమ్మాయి అయినప్పటికీ కూడా నార్త్ లో దూసుకుపోతుంది .. నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించాలని గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైకి ఒంటరిగా పెళ్లి తన సినీ జీవితం మొదలుపెట్టింది .. అలా తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు .. అలా చిత్రం పరిశ్రమలో అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుని హీరోయిన్గా ఎదిగింది .  

అయితే ఆమె తండ్రి ఒకప్పుడు బ్యాట్మెంటన్ ప్లేయర్ .. ఇప్పటివరకు బాలీవుడ్ లో స్టార్ హీరోలకు జంట‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ .. ఇటీవలే  ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో కలిసిన నటించింది .. తెలుగులో కూడా మంచి విజయం అందుకుంది .. ఇంతకీ ఈ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే .. ఇక దీపికా తండ్రి బ్యాట్మెంటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె .. అయితే చిన్నతనం లోనే నటనపై ఆసక్తి పెంచుకున్న దీపికా గ్రాడ్యుయేషన్ పూర్తవుగానే ముంబైకి వెళ్లిపోయి అక్కడ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది ..

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తో తన మొదటి సినిమా చేసే ఛాన్స్ అందుకుంది .. ఓం శాంతి ఓం సినిమా తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తర్వాత ఎన్నో సినిమాలో నటించి మెప్పించింది .. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క కమర్షియల్ యాడ్లు కూడా చేస్తుంది . అయితే గత సంవత్సరం ప్రభాస్ , నాగ్ అశ్విన్  కాంబోలో వచ్చిన కల్కి సినిమా తో సౌత్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది.   అంతకుముందు జవాన్ , పటాన్ సినిమాలతో వరస విజయాలు అందుకుంది .. ఇక ప్రస్తుతం దీపిక తన కూతురి తో కలిసి ఫ్యామిలీ లైఫ్ని ఎంతగానో ఆస్వాదిస్తుంది .  ఈమెకు సోషల్ మీడియాలో 8 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: