తెలుగులో అద్భుతమైన క్రేజ్.. అయినా టాలీవుడ్ మూవీలపై ఆ బ్యూటీ ఇంట్రెస్ట్ చూపడం లేదా..?

frame తెలుగులో అద్భుతమైన క్రేజ్.. అయినా టాలీవుడ్ మూవీలపై ఆ బ్యూటీ ఇంట్రెస్ట్ చూపడం లేదా..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమ లోకి అనేక మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి మొదటి సినిమా తోనే మంచి విజయాలు దక్కి ఆ సినిమాతోనే అద్భుతమైన క్రేజ్ ను కూడా సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకున్న నటీమణులలో రాశి కన్నా ఒకరు.

ఈమె ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును కూడా దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఈ బ్యూటీ తెలుగు లో ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించకపోయిన మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించి ఎన్నో విజయాలను అందుకుంది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ తెలుగు సినిమాల కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తుంది. ఇకపోతే ఆఖరుగా ఈ బ్యూటీ తెలుగు సినిమా చేది చాలా కాలం అవుతుంది.

ప్రస్తుతం ఈమె కేవలం తెలుసు కదా అనే ఒకే ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది. కానీ ఈ మధ్య కాలంలో ఈమె అనేక తమిళ , హిందీ సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించింది. అలాగే ప్రస్తుతం కూడా ఈమె చేతిలో అనేక తమిళ , హిందీ సినిమాలు ఉన్నాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నా కూడా ఈ బ్యూటీ ఎక్కువ శాతం తెలుగు సినిమాల్లో నటించకుండా తమిళ , హిందీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి ని చూపుతుంది అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: