
లూసిఫర్-2 చిత్రానికి మోహన్ లాల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
మోహన్ లాల్.. గత నాలుగున్నర దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ ఎన్నో చిత్రాలలో నటించి, ప్రేక్షకులను అలరించి అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం లూసిఫర్ 2: ఎంపురాన్ మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి ఒక ఆంగ్లం మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు మోహన్ లా ఈ నేపథ్యంలోనే ఆయన తన కెరియర్ గురించి పంచుకున్నారు.
మోహన్ లాల్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 47 సంవత్సరాలు అవుతోంది. ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. నా విజయం వెనుక ఎంతో మంది దర్శక నిర్మాతలు, నటీనటులు కూడా ఉన్నారు. వాళ్ల కారణంగానే నేను ఇంత మంది అభిమానులను కూడా సొంతం చేసుకోగలిగాను. నాకు విభిన్నమైన పాత్రలు ఇచ్చారు. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో నటించే అవకాశం కూడా కల్పించారు. బాక్సాఫీస్ నంబర్ల కంటే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ముఖ్యం. రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు నాకు చాలానే ఉన్నాయి. కలెక్షన్స్ ఎంత ముఖ్యమో ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా మలయాళ భాష మీద అభిమానంతోనే మరో భాషలో ఎక్కువగా సినిమాలు చేయాలని అనిపించలేదు. అటు హిందీలో కూడా అందుకే నటించలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఒక డైరెక్టర్ పృథ్వీ రాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. మోహన్ లాల్ కారణంగానే ఈ లూసిఫర్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు .ఒక దర్శకుడిగా నేను కూడా నిర్మాతలు గురించి ప్రతి క్షణం ఆలోచిస్తాను. మనం తీసుకునే ప్రతి రూపాయికి కూడా న్యాయం చేయాలి. అయితే ఈ సినిమా కోసం మోహన్ లాల్ ఒక రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు అంటూ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా తమ రెమ్యూనరేషన్ మొత్తం సినిమా కోసమే పెట్టామని డైరెక్టర్ తెలిపారు.