కృష్ణంరాజు తన విలనిజంతో ఎంతోమందికి చెమటలు పట్టించారు.కొంతమంది హీరోయిన్లు అయితే ఈయన విలనిజానికి తట్టుకోలేక పట్టపగలే చుక్కలు చూసేవారు. అలా ఇబ్బందులు పడ్డ హీరోయిన్లలో ఈ సీనియర్ నటి కూడా ఉందట.ఆ హీరోయిన్ బట్టలు చించి కుక్కని మీదికి పంపడంతో ఆరోజు నరకం చూసిందట. మరి ఇంతకీ కృష్ణంరాజు ఆ హీరోయిన్ బట్టలు ఎందుకు చించారు.. ఎందుకు అంతలా ఇబ్బంది పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. కృష్ణం రాజు బట్టలు చింపింది ఏ హీరోయిన్ వో కాదు సీనియర్ నటి గీతాంజలివి.ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన గీతాంజలి ఆ తర్వాత స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రలో కూడా చేసింది.ఇక వయసు మీద పడ్డాక ఇప్పుడున్న హీరోల సినిమాల్లో తల్లి, అత్త, బామ్మ పాత్రలు కూడా పోషించింది.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బతికున్న సమయంలో ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని అప్పటి సినిమాల్లో ఏర్పడే పరిస్థితులను అప్పటి సినిమా ముచ్చట్లను హీరోలతో హీరోయిన్లతో తనకి ఉన్న అనుబంధాలను బయట పెట్టింది. అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం బతికి లేకపోయినప్పటికీ ఆమె మాట్లాడిన వీడియోలు మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలా దాదాపు 6 సంవత్సరాల క్రితం మరణించిన గీతాంజలి ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఆ వీడియోలో ఏముందంటే.. కృష్ణంరాజుతో నేను మంచి రోజులు వచ్చాయి అనే మూవీలో చేశాను. అయితే ఈ మూవీలో నేను హీరోయిన్ కాదు అక్కినేని నాగేశ్వరరావు కి చెల్లెలి పాత్రలో నటించాను.
అయితే ఈ మూవీలో విలన్ గా నటించిన కృష్ణంరాజు నన్ను రేప్ చేసే సన్నివేశం ఉంటుంది. అయితే ఆ సన్నివేశం చేసే టైంలో నాకు చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే కృష్ణంరాజుపై ఉమ్మి వేయడం ఇష్టం లేదు.కానీ సినిమాలో భాగంగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణంరాజు నా బట్టలు చింపేసి నా జుట్టు మొత్తం చెరిపేసి నా మీదకు కుక్కను వదిలిపెడతాడు. ఆ టైంలో నేను చాలా నరకం అనుభవించాను. అయితే ఇది షూటింగ్లో భాగమే అయినప్పటికీ నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఆరోజు కృష్ణంరాజు వల్ల నేను ఎంతగానో ఇబ్బందిపడ్డాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని సీన్ అంటూ గీతాంజలి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.