మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితం మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. ఇకపోతే మిస్టర్ బచ్చన్ లాంటి భారీ అపజయం తర్వాత రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శ్రీ లీల , రవితేజకు జోడిగా నటిస్తోంది.
గతంలో రవితేజ , శ్రీ లీల కాంబోలో వచ్చిన ధమాకా మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పనులు పూర్తి కాగానే రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు అనుగుణంగా ఈ సినిమా పనులను పూర్తి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే కిషోర్ తిరుమల , రవితేజతో చేయబోయే సినిమాకు సంబంధించిన పనులను మొదలు పెట్టాడు అని , అందులో భాగంగా ఈ మూవీ లో రవితేజకు జోడిగా ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నట్లు , వారిని ఇప్పటికే కిషోర్ తిరుమల సెలెక్ట్ కూడా చేసినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు రవితేజ సినిమాకు సంబంధించిన హీరోయిన్లను కిషోర్ తిరుమల ఫైనల్ చేయలేదు అని , ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లో కిషోర్ తిరుమల బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.