ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో అత్యధిక మంది వీక్షించిన టాప్ 10 సినిమాల లిస్టులో ఏకంగా తెలుగు సినిమాలే 3 ఉండడం విశేషం. మరి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో టాప్ 10 లో నిలిచిన ఇండియన్ మూవీస్ లలో టాప్ 10 లో స్థానాన్ని దక్కించుకున్న ఆ మూడు తెలుగు సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.
ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న టాప్ 10 మూవీలలో పుష్ప పార్ట్ 2 మూవీ కూడా నిలిచింది. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు 9.4 మిలియన్ న్యూస్ ను నెట్ ఫ్లిక్స్ లో దక్కించుకొని ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ ను నెట్ ఫ్లిక్స్ లో దక్కించుకున్న సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది. ఇకపోతే నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఇప్పటివరకు ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో 5 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ ను నెట్ ఫ్లిక్స్ లో దక్కించుకున్న ఇండియన్ మూవీస్ లో ఐదవ స్థానంలో నిలిచింది. ఇకపోతే టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య తాజాగా తండెల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నేట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 2 మిలియన్ వ్యూస్ ను ఈ సంవత్సరం దక్కించుకొని ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న టాప్ 0 ఇండియన్ మూవీస్ లలో 8 వ స్థానంలో కొనసాగుతుంది.