పవన్ కళ్యాణ్ అడిగినదానికి ప్రభాస్ "నో" మహేష్ బాబు "ఎస్".. ట్రెండ్ మార్చేస్తున్నారుగా..!

frame పవన్ కళ్యాణ్ అడిగినదానికి ప్రభాస్ "నో" మహేష్ బాబు "ఎస్".. ట్రెండ్ మార్చేస్తున్నారుగా..!

Thota Jaya Madhuri
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇప్పుడు పొలిటికల్ పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఎవరు టచ్ చేయాలని స్థాయికి ఎదిగిపోయారు.  అటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి అన్న సరే ఒక అర్హత ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిప్రాయం.  రీసెంట్గా ఇప్పుడు సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను ఎంత నిజాయితీతో నివర్తిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే .

కాగా గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ని నోరు తెరిచి అడిగిన సరే ఆ పని చేయకపోవడం ఆ తర్వాత మహేష్ బాబు వెంటనే ఆ పని చేసేయడం జనాలకు ఆశ్చర్యకరంగా అనిపించింది.  అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ పెద్ద హీరో .. ప్రభాస్ - మహేష్ బాబు కూడా పెద్ద హీరోలే కాదు అనడంలేదు. కానీ వాళ్లతో కంపేర్ చేస్తే పవన్ ఒక్క మెట్టు హై స్టెప్ లోనే ఉంటాడు.

పవన్ కళ్యాణ్ నోరు తెరిచి అడిగితే ఎవరు కూడా నో అని చెప్పరు.  కానీ ప్రభాస్ మాత్రం నో చెప్పడం అప్పట్లో అందరికీ షాకింగ్ గా అనిపించింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా "జల్సా" . ఈ సినిమా ఎంత హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో వాయిస్ ఓవర్ కోసం ప్రభాస్ ని అప్రోచ్ అయ్యారట  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . అయితే ప్రభాస్ తన వాయిస్ బాగోదు అంటూ రిజెక్ట్ చేశారట . వెంటనే మహేష్ బాబు ని అడగ్గా.. మహేష్ బాబు సెకండ్ కూడా ఆలోచించుకోకుండా ఒక్క రూపాయి తీసుకోకుండానే ఈ సినిమా మొత్తం కి వాయిస్ ఓవర్ ఇచ్చారట.  అప్పట్లో ఈ వార్త బాగా ట్రెండ్ అయింది.  అంతేకాదు ఒక స్టార్ హీరో నటించిన సినిమాకి మరొక స్టార్ హీరో మహేష్ బాబు  వాయిస్ ఇవ్వడం కూడా ట్రెండ్ సెట్ చేశారు స్టార్ హీరోస్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: