టాలీవుడ్ లో టాప్ 1-10 హీరోల లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే..?

frame టాలీవుడ్ లో టాప్ 1-10 హీరోల లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే..?

RAMAKRISHNA S.S.
సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే  హీరోలందరూ కలిసిపోతూ కనిపిస్తూ ఉంటారు. కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప.. మా హీరో నెంబర్ వన్ అంటే మా హీరో  అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం పైన ఇప్పటికీ చెప్పడం కష్టంగానే ఉంటుంది. తాజాగా ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన ఫిబ్రవరి నెల ప్రకారం ఇందులో సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ నటులను వెనక్కి నెట్టి మరి టాలీవుడ్ యాక్టర్స్ టాప్ ప్లేస్ లో ఉన్నారట. అందులో మొదట ప్రభాసే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే ఫౌజి, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు సంబంధించి చేయవలసి ఉన్నది.. ఎక్కువగా ప్రభాస్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉండడంతో టాప్ వన్ లో నిలిచారు. ఆ తర్వాత రెండో ప్లేస్ లో దళపతి విజయ్ ఉన్నారు.. ఇటీవలే రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడంతో పాటుగా ఈయన జననాయగన్ అనే సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటున్నారు. మూడో ప్లేసులో అల్లు అర్జున్ ఉన్నారు.పుష్ప 2 సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని కూడా థర్డ్ ప్లేస్ లో ఉండడం గమనార్హం.

నాలుగవ ప్లేస్ లో షారుక్ ఖాన్ ఉన్నారు.. గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ ఐదవ ప్లేసులో.. మహేష్ బాబు SSMB -29 తో ఆరవ ప్లేసులో.. హీరో అజిత్ ఏడవ ప్లేసులో ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ఎనిమిదవ ప్లేసులో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ చివరి రెండు స్థానాలను అందుకున్నారు. అయితే ఈ ఓర్మాక్స్ సంస్థ ప్రతినెలా కూడా భారతదేశంలో ఉండే టాప్ సెలబ్రిటీలకు సంబంధించి అన్ని ర్యాంకులను కూడా విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ప్రతినెలా కూడా స్టార్ హీరోల, హీరోయిన్స్  ర్యాంకులు కూడా మారుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: