దగ్గుబాటి రానాతో పాటు 25 మంది కేసు నమోదు..?

frame దగ్గుబాటి రానాతో పాటు 25 మంది కేసు నమోదు..?

Veldandi Saikiran
నేటి కాలంలో ఎక్కడ చూసిన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్స్ చేయడం విపరీతంగా పెరిగిపోయింది. సినీ సెలబ్రిటీలు, సామాన్య మానవులు, యూట్యూబర్స్, ఇన్ స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా వేదికలలో ఎక్కడా చూసిన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులను సంపాదిస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోలపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత మందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

వారిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దగ్గుబాటి రానా పేరు కూడా వినిపిస్తోంది. అంతేకాకుండా రానాతో పాటు మరో 25 మందిపై కూడా మియాపూర్ పోలీసులు కేసును నమోదు చేశారు. హీరో రానా దగ్గుబాటితో పాటు నటుడు ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ లపై కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా హీరోయిన్లలో కూడా అనేకమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగానే హీరోయిన్ మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత పైన కూడా కేసు నమోదు అయింది. అంతేకాకుండా యూట్యూబర్ అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, యాంకర్ శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటుగా నేహా పతాన్, పాండు పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ లపై కూడా కేసులు నమోదు అయ్యాయి. సాయి, విష్ణు ప్రియ, భయ్యా సన్నీ, నటి శ్యామలపై కేసులు నమోదు అయ్యాయి.

బండారు శేష సుకృతి, రీతూ చౌదరి, టేస్టీ తేజలపై కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి వీరిని అరెస్ట్ చేస్తారా లేదా అనే సందేహంలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే కొంతమంది యూట్యూబర్లను, సామాన్య మానవులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరి వీరు సెలబ్రిటీలు అయిన నేపథ్యంలో వీరిపైన పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారా లేదా అనే గందరగోళం నెలకొంటుంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: