బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సల్మాన్ ఇప్పటి వరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మాత్రం సల్మాన్ కి భారీ విజయాలు దక్కడం లేదు. కొంత కాలం క్రితం సల్మాన్ "టైగర్ 3" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ఇకపోతే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ "సికిందర్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఏ ఆర్ మురగదాస్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను ఈ మూవీ యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని కేవలం 2 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
2 గంటల 20 నిమిషాల నిడివి అనేది చిన్న , మీడియం రేంజ్ సినిమాలకు తక్కువ నిడివి ఏమీ కాదు. కానీ స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఎక్కువ శాతం రెండున్నర గంటలు , అంతకు మించిన నిడివితో వస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసినట్లయితే ఇది కాస్త తక్కువ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ తో సల్మాన్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.