కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ "ఛావా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అత్యంత భారీ అంచనాల నడుమ మొదట కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల అయింది. ఈ మూవీ కి అద్భుతమైన టాక్ వచ్చి భారీ కలెక్షన్లు దక్కాయి. దానితో ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు వర్షన్ కి కూడా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి.
ఇకపోతే తాజాగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో కోర్టు అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. నాని ఈ మూవీ ని రూపొందించాడు. మార్చి 14 వ తేదీన మంచి అంచనాల నడప విడుదల అయిన ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఇప్పటికే ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను కూడా అందుకుంది. ఇకపోతే తాజాగా బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో ఛావా మూవీ ని కోర్ట్ మూవీ భారీ మార్జిన్ తో దాటి వేసింది.
అసలు విషయం లోకి వెళితే ... మార్చి 18 వ తేదీన 24 గంటల సమయంలో బుక్ మై షో లో ఛావా మూవీ కి సంబంధించిన 48 కే టికెట్స్ సేల్ కాగా , కోర్టు మూవీ కి సంబంధించిన 53 కే టికెట్స్ సేల్ అయ్యాయి. అలా ఛావా మూవీ కంటే కూడా కోర్టు మూవీ కి బుక్ మై షో లో మార్చి 18 వ తేదీన ఎక్కువ టికెట్స్ సేల్స్ జరిగాయి. దానితో భారీ మార్జిన్ తో ఛావా మూవీ ని బుక్ మై షో లో కోర్టు మూవీ దాటేసింది. ఇకపోతే ప్రస్తుతం ఛావా మరియు కోర్టు రెండు సినిమాలకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి.