స్టూడెంట్స్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మూవీ యూనిట్.. వారికి టికెట్ ధర కేవలం అంతే..?

frame స్టూడెంట్స్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మూవీ యూనిట్.. వారికి టికెట్ ధర కేవలం అంతే..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రీ రిలీజ్ అయిన చాలా సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం నాచురల్ స్టార్ నాని హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రమణ్యం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో విజయ్ దేవరకొండ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ని మార్చి 21 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు స్టూడెంట్స్ కి ఒక అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించారు.

ఈ మూవీ యూనిట్ తాజాగా మీరు స్టూడెంట్ అయి ఉండి , మీ ఐడి కార్డును చూపించినట్లయితే మీరు 100 రూపాయలకే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను థియేటర్లో చూడవచ్చు అనే ఆఫర్ ను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా అధికారికంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా రీ రిలీస్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: