సరికొత్త రికార్డు సృష్టించిన ఛావా.. బాలీవుడ్ స్టార్ హీరోల వల్ల కూడా కాలేదుగా..?

frame సరికొత్త రికార్డు సృష్టించిన ఛావా.. బాలీవుడ్ స్టార్ హీరోల వల్ల కూడా కాలేదుగా..?

Pulgam Srinivas
తాజాగా హిందీ నటుడు విక్కీ కౌశల్ "ఛావా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ని కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల చేశారు. ఈ సినిమాకు భారీ బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. అలా ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న సమయం లో ఈ మూవీ ని తెలుగు లో డబ్ చేసి విడుదల చేశారు.

అప్పటికే ఈ మూవీ హిందీ వర్షన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ఉండడం తో ఈ మూవీ తెలుగు వర్షన్ పై టాలీవుడ్ ప్రేక్షకులు మంచి ఆచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ తెలుగు వర్షన్ కి కూడా అద్భుతమైన కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కాయి. ఇకపోతే తాజాగా ఛావా మూవీ బుక్ మై షో లో ఒక అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల వల్ల కూడా కానీ ఒక రికార్డును ఛావా మూవీ తో విక్కీ కౌశల్ అందుకున్నాడు. అసలు విషయం లోకి వెళితే ... బుక్ మై షో లో ఇప్పటి వరకు ఛావా మూవీ కి సంబంధించిన 12 మిలియన్ టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఏ హిందీ సినిమాకు కూడా బుక్ మై షో లో ఇన్ని  టికెట్లు సేల్ కాలేదు అని ఛావా మూవీ 12 మిలియన్ టికెట్ సేల్స్ ను బుక్ మై షో లో అందుకొని అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటికి కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: