
ప్రభాస్ రాజాసాబ్ .. సెప్టెంబర్ లో పక్క అంటున్నారుగా..!
ఇంకా చాలా చాలా అయితే ప్రజెంట్ విశ్వసనియ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ రాజా సాబ్ కోసం సెప్టెంబర్లో రెండు డేట్లు లాక్ చేశారట .. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక దానికి ఈ సినిమా రిలీజ్ అవ్వటం పక్కా అని తెలిసింది . ఇదే క్రమంలో రాజా సాబ్ అధిగమించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి .. ఒకటి షూటింగ్ వర్క్ పూర్తి చేసుకోవటం రెండు సిజీ పనులు కంప్లీట్ చేసుకోవటం .. ఐదు నెలలు గ్యాప్ ఉంది కనుక నెలకు 10 రోజులు వర్క్ చేసిన షూటింగ్ కంప్లీట్ అవుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు . సీజీ పనులు పూర్తి కావాలి .. అది కూడా ఫుల్ క్వాలిటీతో అవన్నీ ఆగస్టు మొదటి నాటికి వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది ..
అలా అయితేనే సెప్టెంబర్ లో రిలీజ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు . ఇక ఇప్పటికే ఈ సినిమాకు బడ్జెట్ చాలా అయింది .. ఇంక అవుతూనే ఉంది .. ఆలస్యం అయిన కొద్దీ పీపుల్ మీడియా సంస్థ మీద వడ్డీల భారం పెరిగిపోతుంది . దీని కారణంగా వీలైనంత త్వరగా అన్ని కంప్లీట్ చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలన్న ప్రయత్నం కూడా చేస్తున్నారు . అందుకే వచ్చే సెప్టెంబర్ లో రిలీజ్ కు గట్టి ప్లాన్ చేస్తున్నారు .. వచ్చే ఏప్రిల్ లో ఈ సినిమా నుంచి టీజర్ ఉండొచ్చు అని కూడా టాక్ .