కన్నప్పను టార్గెట్ చేస్తున్న భైరవ !

frame కన్నప్పను టార్గెట్ చేస్తున్న భైరవ !

Seetha Sailaja
మంచువిష్ణు మంచుమనోజ్ ల మధ్య ఏర్పడ్డ వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మంచు ఫ్యామిలీ సన్నిహితులు కూడ ఈవివాదాలకు పరిష్కారాలు చూపించలేని స్థితికి చెరిపోయాయి అంటూ ఇప్పటికే అనేక గాసిప్పులు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల మధ్య మంచు విష్ణు ఎంతో భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో తీసిన ‘కన్నప్ప’ మూవీని మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ ‘భైరవ’ టార్గెట్ చేస్తూ విడుదల కాబోతూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


300 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీని ఏప్రియల్ 25న విడుదలచేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ లాంటి టాప్ హీరోలు ఈమూవీలో నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈమూవీ విడుదల తేదీని చాల ముందుగా ప్రకటించడంతో ఈమూవీతో మరొక మూవీ పోటీ లేకుండా మంచు విష్ణు చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు.


అయితే విష్ణు అంచనాలకు భిన్నంగా మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ ఆదేరోజున విడుదల కాబోతున్నట్లు లీకులు వస్తూ ఉండటం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలన వార్తగా మారింది. వాస్తవానికి ఈసినిమాను జనవరి లేదంటే ఫిబ్రవరిలో విడుదల చేద్దామని భావించారు. అయితే ఈమూవీలో సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ లో ఆలస్యం జరగడంతో ఈమూవీని ఏప్రియల్ లో విడుదలచేయాలని భావించడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ‘కన్నప్ప’ ను టార్గెట్ చేస్తూ ఉండటం సంచలనంగా మారింది.  


బెల్లంకొండ శ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. తమిళ సూపర్ హిట్ మూవీ ‘గరుడన్’ రీమేక్ గా భారీ బడ్జెట్ తో ఈమూవీని ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో నిర్మించారు. నారా రోహిత్, మంచు మనోజ్ లు ఈమూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి ఈమూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ఈమూవీ కథ ఒక సోషియో ఫ్యాంటసీ అని అంటున్నారు. ఈమూవీ పై మేకర్స్ కు ఉన్న ధీమాతో ఏకంగా ‘కన్నప్ప’ తో పోటీ పడుతూ విడుదల చేస్తున్నారు అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: