ఆత్మలు భూత వైద్యం బాటపడుతున్న హీరోలు .. ఎవరు ఏ సినిమా చేస్తున్నారంటే..!

frame ఆత్మలు భూత వైద్యం బాటపడుతున్న హీరోలు .. ఎవరు ఏ సినిమా చేస్తున్నారంటే..!

Amruth kumar
టాలీవుడ్ లో సినిమాల ట్రెండ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు .. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష , క్షుద్ర  శక్తుల నేపథ్యంలో వచ్చే కథలకు కొత్త జోష్ ను తెచ్చి పెట్టింది .. సరిగ్గా ప్లాన్ చేయలే కానీ పాన్ ఇండియని ఆకర్షించే కంటెంట్ ఈ జోనర్లో గట్టిగా సెట్ చేయవచ్చు .. ఈమధ్య బాలీవుడ్ లోనూ హారర్ సినిమాలను బాగా చూస్తున్నారు .. అలాగే వందల కోట్లు రాబడుతున్నారు .  అందుకే ఇప్పుడు మన హీరోలు ఈ తరహా కథలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు . అల్లరి నరేష్ 12 ఏ రైల్వే కాలనీ కూడా ఈ జోనర్ మూవీ నే .. ఆత్మలు చుట్టు నడిచే హర్రర్ స్టోరీ .. ఆత్మలతో మాట్లాడే పాత్రలో కనిపించబోతున్నాడు అల్లరి నరేష్ ..

పొలిమేర దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు .. ఈ సమ్మర్ లో రిలీజ్ చేయడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తుంది . ఇక మరో అక్కినేని హీరో సుశాంత్‌ హీరోగా పృథ్విరాజ్ ఓ సినిమాను తీసుకువస్తున్నాడు .. ఇక ఇందులో సుశాంత్ ది భూత‌ వైద్యుని పాత్ర ఆ పాత్రకు మరో కోణం కూడా ఉంది .. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇందులో కూడా ఆత్మ, భూత వైద్యం ఎంతో కీలకం .. అలాగే వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ కలయికలో వస్తున్న కొరియన్ కనకరాజు కామెడీ హారర్ టచ్ ఉన్న కథ .. ఇందులో కూడా ఆత్మలు భూత వైద్యం ప్రధానంగా ఉండబోతున్నాయి .. అలాగే రాయలసీమ కొరియన్ ఆత్మ బ్యాక్ డ్రాప్ లో క‌థ‌ని సెట్ చేశాడు దర్శకుడు. మరో దర్శకుడు రమేష్ వర్మ కూడా హారర్ టచ్ అన్న క‌థ‌ని రెడీ చేస్తున్నాడు .. ఇందులో మెయిన్ పాయింట్ కూడా ఆత్మలు భూతవైద‌మే స్క్రిప్ట్ పనులు చక చక జరుగుతున్నాయి ..

టాలీవుడ్ లో ఉన్న ఓ యంగ్ హీరోతో ఈ సినిమా అని అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది .. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ రాజాసాబ్ కూడా హారర్ చుట్టూ తిరిగే స్టోరీని .. మూడు తరాలు ఆత్మలు వాటి భావోద్వేగాలు దుష్టశక్తులు ఇలాంటి ఎలిమెంట్స్ కామెడీ  మిక్స్ చేసి అందరు ఆస్వాదించదగ్గ ఎంటర్టైనర్ గా ఈ కథ‌ని రెడీ చేసాడు మారుతి . అలాగే సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో రాసుకున్న కథలకు ఆడియన్స్ని థియేటర్లకు తీసుకువచ్చే సత్తా ఉంటుంది .. ప్రస్తుతం ఆడియన్స్ కూడా ఓ కొత్త ప్రపంచాన్ని కోరుకుంటున్నారు ఆడియోస్ అభిరుచికి తగ్గట్టుగానే ఈ సినిమాలు వస్తున్నాయి .. ఇందులో ఏ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: