మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కబోతుందనే సంగతి తెలిసిందే..ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.దీనితో అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగింది..మెగాస్టార్ చిరంజీవితో సినిమా సెట్ అవడంతో ఇప్పుడు ఆ సినిమాపై ప్రేక్షకులలో ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే అంచనాలు మించి ఉండేలా ఈ సినిమాని సిద్ధం చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ లాక్ చేశారు. డైలాగు వెర్షన్ రాసేందుకు అనిల్ అండ్ టీం వైజాగ్ కూడా వెళ్లారు..అయితే ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా రానున్నట్లు తెలుస్తుంది.
వింటేజ్ చిరుని ప్రేక్షకులకి అనిల్ మళ్ళీ చూపించబోతున్నాడు..చిరు రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వింటేజ్ చిరు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.బాస్ లోని కామెడీ యాంగిల్ ని ఇప్పటివరకు ఎవరు కరెక్ట్ గా వాడుకోలేదు.. కానీ ఈ సినిమాతో అనిల్ చిరు ని సరికొత్తగా చూపించబోతున్నాడని తెలుస్తుంది..ముఖ్యంగా చిరంజీవి క్యారెక్టర్ రాసుకున్న తీరు బాగా వర్కౌట్ అయిందని దానికి తోడు కథ కూడా బాగా సెట్ అవ్వడంతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని సమాచారం..
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ చిత్రంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని పాత్రను మెగాస్టార్ చేయనున్నారట..అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా అదితీరావు హైదరీ ని ఎంచుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే మెగాస్టార్ వరుసగా యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తున్నారు.. ఈ సినిమా తరువాత మెగాస్టార్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు..