2025లో శ్రీ లీల నటించిన ఎన్ని సినిమాలు విడుదల కానున్నాయో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో శ్రీ లీల ఒకరు. పోయిన సంవత్సరం శ్రీ లీల జోరు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కనబడలేదు. పోయిన సంవత్సరం ప్రారంభంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించి , పోయిన సంవత్సరం చివరలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప 2 మూవీ లో స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పోయిన సంవత్సరం పెద్దగా సందడి చేయని శ్రీ లీల ఈ సంవత్సరం మాత్రం అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

శ్రీ లీల నటించిన రాబిన్ హుడ్ సినిమాను ఈ మార్చి 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నితిన్ ఈ మూవీ లో హీరోగా నటించగా ... వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ జాతర మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్గా ఎంపిక అయింది. ఈ మూవీ ని కూడా ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అఖిల్ కొత్త మూవీ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటించబోతున్నట్లు , ఈ మూవీ ని ఈ సంవత్సరం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ఓ మూవీలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తున్నట్లు , ఆ సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందబోయే బాలీవుడ్ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించబోతున్నట్లు ఆ మూవీ కూడా ఈ సంవత్సరం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలా ఈ సంవత్సరం శ్రీ లీల నటించిన అనేక మూవీలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: