గోల్డ్ స్మగ్లర్ రన్యా రావు కేసులో భారీ ట్విస్టులు..!

frame గోల్డ్ స్మగ్లర్ రన్యా రావు కేసులో భారీ ట్విస్టులు..!

Divya
బెంగళూరులో  స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన హీరోయిన్ రన్యా రావుకు  కష్టాలు ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. ఈమె బేయిల్ పిటిషన్ పైన విచారణ జరిపిన బెంగళూరు కోర్టు రేపటి రోజుకి వాయిదా వేసింది. రన్యా రావు తో వివాహమైన ఆమె భర్త జతిన్ కోర్టులో పలు సంచలన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా రన్యా రావు తో తనకు గత ఏడాది నవంబర్లో వివాహం జరిగిందని తెలిపారు. కానీ డిసెంబర్ నెల నుంచి తాము విడిగా ఉంటున్నామంటూ కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతొ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తాము అధికారికంగా విడిపోలేదు కొన్ని కారణాల చేత వేరుగా ఉండాల్సి వచ్చిందని తెలియజేశారు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయట..రన్యా రావు  బెంగళూరులో మాత్రమే కాకుండా ముంబై, గోవా వంటి ప్రాంతాల నుంచి కూడా ఈమె దుబాయ్ కి వెళ్ళినట్లు DRI అధికారులు వెల్లడించారు.. హవాలా మార్గంలో డబ్బులతో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా అనుమానాలను తెలియజేశారు. ఇప్పటికే 45 సార్లు దుబాయ్ కి ఉదయం పూట వెళ్లేదట
రన్యా రావు. అయితే ఆ తర్వాత సాయంత్రానికి తిరిగి వచ్చేదని తెలియజేశారు.రన్యా రావు భర్త పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఈ నెల 24వ తేదీ వరకు కర్ణాటక హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.

అయితే జతిన్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేస్తామంటూ DRI అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ నటి పైన బిజెపి ఎమ్మెల్యే బసన్న గౌడ కూడా పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె శరీరంలో అన్ని భాగాలలో కూడా బంగారాన్ని స్మగ్లింగ్ చేసిందని మంత్రులకు కూడా ఈ కేసులతో సంబంధం ఉందనే విధంగా మాట్లాడారు సెక్యూరిటీని దుర్వినియోగం చేసుకున్నారని శరీరంలో అన్ని భాగాలలో బంగారం దాచారు అంటూ తెలియజేశారు.. కేంద్ర ప్రభుత్వం ఎవరిని కూడా కాపాడే ప్రయత్నం చేయాలని కచ్చితంగా ఎవరెవరి ప్రమేయం ఉంటుందో వారందరిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: