టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఇకపోతే రామ్ పోతినేని ఈ మధ్య కాలంలో మాత్రం వరుస అపజయాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితం ఈయన ది వారియర్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈయన స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో నటించాడు.
ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది ఇక కొన్ని రోజుల క్రితం ఈయన డబల్ ఈస్మార్ట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా వరుస అపజాలతో డీలా పడిపోయిన రామ్ పోతినేని ప్రస్తుతం మహేష్ బాబు దర్శకత్వంలో రాపో 29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నాడు. ఇకపోతే రామ్ తన తదుపరి మూవీ ని చందు మండేటి దర్శకత్వంలో చేయనున్నట్లు ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించనున్నట్లు ఓ వార్త గత కొన్ని రోజులుగా చాలా వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం రామ్ పోతినేని హీరో గా చందు మండేటి దర్శకత్వంలో ఓ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తలు అన్ని పూర్తిగా అవాస్తవం అని రామ్ పోతినేని "రాపో 22" వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమా తర్వాత మూవీ ని ఇప్పటి వరకు ఓకే చేయలేదు అని , ఆ మూవీ విడుదల అయ్యి ఆ సినిమాకు వచ్చిన రిజల్ట్ ను బట్టి ఆయన తన తదుపరి మూవీ ని ఓకే చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.