అప్ప‌ట్లో ఆ స్టార్ హీరోయిన్‌పై మోజుప‌డ్డ నాగార్జున‌.. షాక్ ఇచ్చిందిగా... !

Amruth kumar
బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది మాధురి దీక్షిత్ ...  మైక్రోబయాలజీలో చదవాలని అనుకున్న మాధురి దీక్షిత్ కి అప్పటికే సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో ముందుగా క్లాసికల్ డాన్స్‌ నేర్చుకుంది .. కథక్ని8 సంవత్సరాలుగా నేర్చుకోవడం కోసం ఆమె చేసిన ప్రయత్నంలో అది ఆమె సినిమా కెరియర్ కు ఎంతో ఉపయోగపడి ఆమెను తిరిగి లేని స్టార్ హీరోయిన్గా తీసుకువెళ్ళింది . 1984లో మాధురి దీక్షిత్ హీరోయిన్గా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తేజ సినిమాతో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. దాంతో వరుసగా రాం లఖన్ , పరిందా , త్రిదేవ్ , దిల్, లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని దక్కించుకుంది. సాజన్, బేటా, ఖల్నాయక్,  హం ఆప్కే హై కౌన్, రాజా, ఇలా.. బ్యాక్ టు బ్యాక్ భారీ కమర్షియల్ హిట్స్ అందుకుంది .


ఆ సమయంలో మాధురి హిందీ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా వార్తల్లో నిలిచింది .. బేటా సినిమాతో రెండోసారి కూడా ఆమె ఫిల్మ్ ఫైర్ అవార్డు కైవసం చేసుకుంది .. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా అబ్బాయిగారు పేరుతో ఈవివి సత్యనారాయణ దర్శకత్వం లో రీమిక్స్ చేశారు . మీన ఈ సినిమాలో హీరోయిన్ .. ఇక నాగార్జున మాధురి దీక్షిత్ ని తెలుగులో హీరోయిన్గా తీసుకురావడానికి అప్పట్లో బాగా ట్రై చేశారట . మాధురి దీక్షిత్ మీద మోజు పడ్డ నాగర్జున తాను హీరోగా అన్నపూర‌ణ‌ బ్యానర్లు నిర్మించిన ఒక సినిమాలో హీరోయిన్గా నటించాలని మాధురి దీక్షిత్ ని అడిగారట .


అయితే అప్పట్లో మాధురి దీక్షిత్ చాలా బిజీగా ఉండడంతో పాటు ఆమె ఆ రోజుల్లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అడగడం తో నాగార్జునకు దిమ్మతిరిగి పోయిందట అది కూడా కేవలం 15 రోజులు మాత్రమే డేట్ లో ఇస్తానని తనకు కోటి రూపాయలు కావాలని చెప్పడం తో తనకు వర్క్ అవుట్ అవ్వదని అనుకున్న నాగార్జున ఈ విషయం లో చేతులు ఎత్తేశాడు .. అప్పట్లో ముంబై నుంచి హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం చేయాలంటే ఎక్కువ ఆసక్తి చూపించింది నాగార్జున .. కానీ మాధురి దీక్షిత్ విషయంలో ఇది సాధ్యం కాలేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: