ఆ హీరోయిన్‌తో ఆర్జీవీ లవ్... చుక్కలు చూపించిన టాలీవుడ్ హీరో...!
శివ సినిమాతో నాగార్జునకి జీవిత కాలానికి సరిపడా స్టార్డం తెచ్చిపెట్టాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .. తెలుగు సినిమా గురించి చెప్పుకోవాలంటే శివ సినిమాకి ముందు శివ సినిమాకు తర్వాత అనేంతగా ఊహించని మార్పులు తెచ్చారు రాంగోపాల్ వర్మ .. రాంగోపాల్ వర్మ శిష్యులు ఈరోజు ఎంతో మంది టాలీవుడ్ లో తిరుగులేని స్టార్స్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు .. ఇది ఇలా ఉంటే తనకు శివ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇచ్చిన వర్మ దర్శకత్వంలో సుమంత్ ను హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు నాగార్జున .. ఈ క్రమంలోనే అన్నపూర్ణ బ్యానర్ లో ప్రేమ కథ సినిమాను ప్రకటించారు.
సుమంత్ హీరోగా ఆర్జీవి దర్శకుడు నాగార్జున నిర్మాత కావడం తో ఈ ప్రాజెక్టు అదిరిపోతుంది అని అందరూ భావించారు . అయితే సుమంత్ ఎంత డమ్మీగా ఉన్నాడో మొదటి సినిమాకి ఒక ఆర్జీవికి మాత్రమే తెలుసు ఎందుకంటే ఈ విషయంలో అనుభవించింది ఆయనే కాబట్టి ఆర్జీవికి ఏదైనా క్షణాల్లో అయిపోవాలి సినిమా సినిమాకి టెక్నీషియన్లు మారిపోతూ ఉంటారు .. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరుగుతూ ఉంటారు అంత స్పీడ్ గా ఉండే ఆర్జీవికి సుమంత్ మాత్రం చుక్కలు చూపించాడట . అప్పటికే ఆర్జీవి ఆ సినిమా హీరోయిన్ అంత్ర మలి లో పీక లోతు ప్రేమలో మునిగిపోయాడట సుమంత్ .. మొదటి సినిమా అనగానే హీరోయిన్గా అంత్ర మలిని ఫిక్స్ అయ్యాడు.
ఆమెతో జర్నీ బాగా సాగుతున్న షూటింగ్లో మాత్రం సుమంత్ ఆర్జీవికి పిచ్చెక్కిచ్చాడట .. ఒక పట్టాన షార్టు ఓకే అయ్యేది కాదని ఆర్జీవి చెప్పిన ఎక్స్ప్రెషన్లు రావడానికి సుమంత్ చాలా టేకులు తీసుకున్నాడని అప్పట్లో టాక్ వినిపించింది .. తప్పక కమిట్‌మెంట్ కాబట్టి ఇంకోవైపు అంత్ర మలి హీరోయిన్గా కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఆర్జీవి సుమంత్ పెట్టిన హింసను భరించాడట .. ఫైనల్ అవుట్ పుట్ మాత్రం బాగా వచ్చి ప్రేమ కథ బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచిపోయింది .. ఈ సినిమాకి అప్పట్లో సందీప్ చౌక అందించిన మ్యూజిక్ పెద్ద హైలైట్ .. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని అనే పాట మ్యూజిక్ లవర్స్ ని ఎప్పటికీ మెప్పిస్తుంది