ఆ హీరోయిన్ ను అమ్మ అని పిలుస్తాను.. కళ్యాణ్ రామ్ క్రేజీ కామెంట్స్ వైరల్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. హీరోయిన్ విజయశాంతిని అమ్మ అని పిలుస్తానని కళ్యాణ్ రామ్ చెప్పగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
 
తండ్రీ కొడుకులు పలు విషయాలలో గొడవ పడటం చివరకు ఒక్కటి కావడం చాలా సినిమాలలో చూశామని కళ్యాణ్ రామ్ అన్నారు. మా సినిమాలో ఎంతో ప్రేమగా ఉండే తల్లీకొడుకులు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? మళ్లీ ఎలా కలుసుకున్నారు? అనే అంశాలతో తెరకెక్కిందని కళ్యాణ్ రామ్ వెల్లడించడం గమనార్హం.
 
అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ తాజాగా రిలీజ్ కాగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. అఖండ2 సినిమా కూడా అప్పటికే షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.
 
బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు దక్కలేదు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ఆ లోటు తీరుతుందేమో చూడాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకుని బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ఒకింత భారి బడ్జెట్ తోనే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. విజయశాంతిని తాను అమ్మ అని పిలుస్తానని కళ్యాణ్ రామ్ వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: