ప్రభాస్ ఫౌజీలో మరో హీరోయిన్ ఎవరో తెలుసా...!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ప్రభాస్ పేరు చెపితే ఇండియా సినీ లవర్స్ అంతా మెస్మరైజ్ అయిపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వం లో ది రాజా సాబ్ సినిమా లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే కల్కి 2 - సలార్ 2 సినిమా లు కూడా లైన్లో ఉన్నాయి. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫౌజీ. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. ఇక ఆలియా సినిమా లో యువరాణి పాత్రలో కనిపిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా లో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కథ ప్రకారం సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ హీరోయిన్ పాత్ర సినిమా కు కీలకం అంటున్నారు. ఈ పాత్ర కోసం బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కరీనా కపూర్ ను తీసుకోబోతున్నట్లు జాతీయ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇక ఫౌజీ సినిమా లో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడట. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. ఇక ఇటీవలే అనుపమ్ ఖేర్ ఫౌజీ సినిమా సెట్స్ లో కూడా జాయిన్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తుండగా ... మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమా పై ఉన్న భారీ అంచనాలకు తగినట్టుగానే దర్శకుడు హను రాఘవపూడి సినిమాని తెరకెక్కిస్తున్నాడు.