టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా విజయాన్ని అందుకుంది. ఆఖరుగా ఈ దర్శకుడు విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో చాలా కాలం తర్వాత రమణ గోగుల ఓ పాట పాడాడు. ఆ పాట అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయింది. ఈ సినిమా విజయంలో ఆ పాట కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది.
ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి తన తదుపరి మూవీ ని మెగాస్టార్ చిరంజీవి తో చేయబోతున్నాడు. ఈ మూవీ ని సాహు గారపాటి నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ డైలాగ్ వర్షన్ తో సహా అనిల్ రావిపూడి కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం సమ్మర్ లో ఈ మూవీ ని మొదలు పెట్టి ఈ వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేసే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరంజీవి తో తీయబోయే సినిమాలో కూడా అనిల్ రావిపూడి , రమణ గోగుల తో ఓ పాట పాడించడానికి రెడీ అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఆ పాటను కూడా రికార్డింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రమణ గోగుల పాడిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. మరి చిరు , అనిల్ కాంబోలో రాబోయే సినిమాలో రమణ గోగుల పాడే పాటకు అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.