ఏకంగా అన్ని కోట్లకి అమ్ముడుపోయిన కింగ్డమ్ ఆడియో హక్కులు.. ఇది కథ క్రేజ్ అంటే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన యువ నటులలో ఒక రు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ కొంత కాలం క్రితం అధికారికంగా ప్రకటించాడు. ఈ మూవీ కి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి అనురుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ యొక్క ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఓ ప్రముఖ సంస్థ ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను ఏకంగా 15 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే కింగ్డమ్ మూవీ కి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేయగా ... అది అద్భుతంగా ఉండటంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అద్భుతమైన స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd

సంబంధిత వార్తలు: