తన కెరియర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజమౌళి చేసిన వన్ అండ్ ఓన్లీ మూవీ ఇదే..!
రాజమౌళి సినిమా కోసం ఎంత కష్టపడతాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. కేవలం ఆయన కష్టపడడు .. పక్క వాళ్ళని కూడా కష్టపెడతాడు . అలాంటి ఒక హ్యూజ్ హ్యూజ్ పని పిచ్చోడు రాజమౌళి అంటూ ఆయనతో వర్క్ చేసిన స్టార్స్ చెప్తూ ఉంటారు . కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి సంబంధించిన మరొక వార్త ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి తన కెరీర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన వన్ అండ్ ఓన్లీ ఫిలిం గా "మర్యాద రామన్న" రికార్డ్స్ క్రియేట్ చేసింది .
అప్పట్లో జనాలు ఈ సినిమా గురించి ఎక్కువుగా మాట్లాడుకుంటూఉ వచ్చారు. మర్యాద రామన్న సినిమాని చాలా చాలా టైం పాస్ గా చేశాడు రాజమౌళి అంటూ అప్పట్లో టాక్ వినిపించింది . మగధీర సినిమా తర్వాత ఆయన కేవలం ఆరు నెలల కాల్ షీట్స్ మాత్రమే ఖర్చు చేసి ఈ మర్యాద రామన్న సినిమాని తెరకెక్కించారు. ఈ స్టోరీ రాజమౌళి కెరీర్ లోనే చాలా చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ గా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కోసం ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కేవలం ఫ్రెండ్షిప్ కారణంగా టైంపాస్ చేస్తూ ఈ మూవీని తెరకెక్కించారట . అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . రాజమౌళి కెరియర్ లో ఏ సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు . మర్యాద రామన్న కూడా అంతే. చాలా చిన్న కాన్సెప్ట్ చిన్న బడ్జెట్ అయినా సరే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది . ఈ సినిమా తర్వాత రాజమౌళి పేరు మరింత స్థాయిలో పాపులారిటీ దక్కించుకోవడం మనం చూసాం..!