సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత..!
ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లిన తర్వాత ఏఆర్ రెహమాన్ ఇంటికి వచ్చారట. ఈ తరుణంలోనే చాతి నొప్పి అంటూ... ఒకసారి గా ఏ ఆర్ రెహమాన్ కుప్పకూలినట్లు సమాచారం అందుతోంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఆయన సిబ్బంది అలాగే కుటుంబ సభ్యులు.... ఆస్పత్రికి తరలించడం జరిగింది. చెన్నైలో ఉన్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. దీంతో అతన్ని చెన్నైలోని... అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఇక చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతానికి ఏ ఆర్ రెహమాన్ ఆరోగ్యం కాస్త కుదిటపడినట్లయితే చెబుతున్నారు. ఆయనకు కార్డియాలజీ విభాగం వైద్యులు చికిత్స అందిస్తున్నారని సమాచారం అందుతుంది. ఏఆర్ రెహమాన్ ఆరోగ్యం విషయంలో... ఎవరు కూడా ఆందోళన చెందకూడదని వైద్యులు కూడా ప్రకటించారు.
సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రి పాలైన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన వెంటనే కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ త్వరగా కోలుకోవాలని.... పేర్కొంటూ.. పోస్టులు పెడుతున్నారు. ఇక సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ హెల్త్ ఇష్యూ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.