' క‌ల్కి 2 ' ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌... అమితాబ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారుగా...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “ కల్కి 2898 ఏడీ ” బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ నిర్మించిన ఈ సినిమా రు. 1200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినీ ప్రేమికుల మ‌న‌స్సులు గెలుచుకుంది. నాగ్ అశ్విన్ లాంటి యంగ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన ఈ సినిమా క‌థ .. క‌థ‌నాలు ఇండియ‌న్ సినీ ప్రేక్ష‌కుల‌కు చాలా కొత్త‌గా ఉన్నాయి. ఇక క‌ల్కి సినిమాకు కొనసాగింపుగా ‘ కల్కి 2 ’ రానున్న విషయం తెలిసిందే.  కల్కి 2 సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ వ‌స్తుందా ? అని ఇండియ‌న్ సినీ ప్రేమికులు ఎంతో ఆస‌క్తి తో వెయిట్ చేస్తున్నారు. ఏ చిన్న అప్ డేట్ వ‌చ్చినా కూడా ఖుషీ అయిపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అయితే క‌ల్కి 2 అప్ డేట్స్ కోసం ఈగ‌ర్ గా వెయిటింగ్ లో నే ఉన్నారు.

అయితే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ క్రేజీ సీక్వెల్ పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘ కౌన్ బనేగా కరోడ్‌పతి ’ పూర్తి అయిన వెంట‌నే తాను  కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటానన్నారు. ఇక క‌ల్కి క్రేజీ సీక్వెల్ క‌ల్కి 2 సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని స‌మాచారం. ‘ కల్కి 2898 ఏడీ ’ లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె.. పార్ట్‌ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనుంద‌ట‌. కొద్ది రోజుల క్రితం క‌ల్కి నిర్మాత‌లు అయిన స్వప్న ద‌త్ - ప్రియాంక ద‌త్ మాట్లాడుతూ.. ‘ కల్కి 2898 ఏడీ ’తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన షూట్‌ను కొంతమేర తీశామ‌ని తెలిపారు. క‌ల్కి పార్ట్ 2 కు సంబంధించి 35 శాతం షూట్‌ జరిగింది అని వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: