కోటి జన్మలెత్తినా సరే రవితేజ అలాంటి మూవీ చేయడు..చేయలేడు..ఎందుకంటే..?
ఒకానొక మూమెంట్ లో రవితేజ సినిమా రిలీజ్ అవుతుంది అంటే పెద్ద సినిమా హీరోలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది . అలాంటి ఫ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్నాడు రవితేజ . రవితేజ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా "విక్రమార్కుడు". రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు. ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . చాలా ఫ్రెష్ ఫీలింగ్ ని కలగజేస్తూ ఉంటుంది . రవితేజ కెరియర్ లో చాలా సినిమాలో నటించాడు.
రవితేజ ఫ్యూచర్ లో కూడా చాలా సినిమాలల్లో నటిస్తాడు . కానీ ఇలాంటి ఒక సినిమా తన ఖాతాలో ఇకపై వేసుకోడు.. వేసుకోబో లేడు అంటూ చాలామంది ఫ్యాన్స్ మాట్లాడారు . ఈ సినిమాలో రవితేజ పర్ఫామెన్స్ కెవ్వు కేకే . రవితేజ తప్పిస్తే ఈ రోల్ కి వేరే హీరోని అస్సలు ఊహించుకోలేం . నిజానికి ఈ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ని అనుకున్నారట రాజమౌళి . కానీ ఆయన ఈ మూవీ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత రవితేజ సెలెక్ట్ అయ్యాడు . ఈ సినిమా రవితేజ కెరియర్ నే మలుపు తిప్పిందని చెప్పాలి..!!