కమిట్మెంట్ పై.. నటి అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి కమిట్మెంట్ మీద చాలామంది హీరోయిన్స్ పలు రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. మిటూ ఉద్యమం వచ్చిన తర్వాత చాలా మంది ఇలాంటి విషయాల పైన ధైర్యంగా మాట్లాడారు. ఇప్పటికీ కొంతమంది హీరోయిన్స్, నటీమణులు సైతం ఈ విషయం పైన అక్కడక్కడ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అలనాటి నటి అన్నపూర్ణమ్మ కమిట్మెంట్ పైన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఇందులో ఇండస్ట్రీలో గురించి అక్కడ జరిగే విషయాల గురించి తెలియజేసింది.

ముఖ్యంగా ఇండస్ట్రీ విషయం పైన ఈ మధ్యకాలంలో ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారు అయితే ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు బలవంతం పెట్టరు.. అది వారి ఇష్టంగానే  అన్ని జరుగుతూ ఉంటాయని తెలియజేసింది..టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు రావు అనేది అసలు తాను నమ్మనని... ఏదో మీడియాలో హైలెట్ కావడానికి కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని తెలియజేసింది నటి అన్నపూర్ణమ్మ. ఇండస్ట్రీ అనేది మన అందరిదీ దాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటేనే మనకు అవకాశాలు వెలుపడతాయని తెలిపింది. ప్రస్తుతం అన్నపూర్ణమ్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.

అన్నపూర్ణమ్మ గతంలో ఎన్నో చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలుగా నటించిన అన్నపూర్ణము.. అయితే ఈమధ్య వయస్సు  రీత్యా తక్కువ సినిమాలలో నటిస్తూ ఉన్నది ఇమే. అయినప్పటికీ కూడా పలు రకాల షోలకు, చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వైరల్గా మారుతూ ఉంటుంది నటి అన్నపూర్ణమ్మ. విభిన్నమైన కామెడీ చిత్రాలలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటోంది. ఈమె కోసమే కొన్ని ప్రత్యేకమైన పాత్రలు చిత్రీకరించినట్టుగా కనిపిస్తూ ఉంటాయి..అన్నపూర్ణమ్మ ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నో వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: