ఈ వారం ఓటీటీలోకి 10 సినిమాలు...ఏ సినిమా ఏ ఓటీటీలోకి?
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల లిస్ట్ చూద్దాం. ఈటీవీ వీన్ ఓటీటీలో రామం రాఘవం సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా జబర్దస్త్ ధనరాజ్ దర్శకత్వం వహించారు. అలాగే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా హోలీ పండుగ కానుకగా మార్చి 14న విడుదల అయ్యి స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ఫ్రైమ్ ఓటీటీలో బీ హ్యాపీ అనే హిందీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోగా అభిషేక్ బచ్చన్ నటించారు. జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో బాసిల్ జోసెఫ్ హీరోగా నటించింది పోన్మన్ సినిమా కూడా రిలీజ్ అయింది.
కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా నెట్ ప్లీక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇక తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ హత్య మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అలాగే త్రయం అనే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. వనవాస్ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టింది. రేఖాచిత్రం మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆహా తమిళం ఓటీటీలో 2కే లవ్ స్టోరీ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకెందుకు ఆలస్యం సినీ ప్రియులు వెళ్లి ఈ అద్బుతమైన సినిమాలను వీక్షించండి .. ఎంజాయ్ చేయండి.