మొదటి రోజు కోర్టు మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఇవే.. అఫీషియల్ పోస్టర్ విడుదల..?

frame మొదటి రోజు కోర్టు మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఇవే.. అఫీషియల్ పోస్టర్ విడుదల..?

Pulgam Srinivas
ప్రియదర్శి , హర్ష్ రోషన్ , శ్రీదేవి ముఖ్య పాత్రలలో కోర్టు అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. రామ్ జగదీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ని నిర్మించాడు. శివాజీ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా బృందం వారు ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ఇకపోతే ఈ సినిమాను నిన్న అనగా మార్చి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ మూవీ విడుదలకు దాదాపు రెండు రోజుల ముందు నుండి ఈ మూవీ మేకర్స్ ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ సినిమాకు ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి నిన్న అనగా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ఓపెనింగ్లు లభించాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో కలిపి ఎన్ని కోట్ల కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చాయి అనే విషయాన్ని తెలియజేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

తాజాగా మూవీ బృందం ఈ సినిమాకు ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 8.10 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ చాలా రోజుల పాటు మంచి కలెక్షన్లు వసూలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: