ఇప్పటి వరకు ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొద లు పెట్టి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకు న్న వారు తెలుగు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు . ఇకపోతే చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్గా అవకాశా లను దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటి మనులలో రీతూ వర్మ ఒకరు. ఈ బ్యూటీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బాద్ షా సినిమాలో కాజల్ కి చెల్లెలు పాత్రలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.
ఈ మూవీ మంచి విజయం సాధించడంతో రీతూ వర్మ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె పెళ్లి చూపులు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈ నటికి హీరోయిన్గా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ నటి కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
తాజాగా ఈ బ్యూటీ సందీప్ కిషన్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్గా నటించింది. కొన్ని రోజుల క్రితం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం రీతూ వర్మ అనేక సినిమా అవకాశాలను తెలుగు లో దక్కించుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.