కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ఈ మూవీ లో రజనీ కాంత్ హీరో గా నటిస్తూఉండడం , ఆ సినిమాలో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండడం , ఆ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ స్టార్ట్ కావడం తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతుంది. దానితో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమీర్ ఖాన్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , ఈయన పాత్రను నిడివి ఈ సినిమాలో చాలా తక్కువ గానే ఉండనున్నట్లు , కానీ ఆయన పాత్రకు అద్భుతమైన ప్రాధాన్యత ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే కూలీ సినిమాలో కనుక అమీర్ ఖాన్ నటించినట్లయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.
ఇది ఇలా ఉంటే అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు లోకేష్ , అనిరుద్ కాంబోలో వచ్చిన సినిమాల మ్యూజిక్ కి అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా సంగీతం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.