Rc-16: బ్యాట్ పట్టిన రామ్ చరణ్.. లీకైన వీడియో వైరల్..!

frame Rc-16: బ్యాట్ పట్టిన రామ్ చరణ్.. లీకైన వీడియో వైరల్..!

Divya
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం..RC -16. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నది. ఇందులో హీరో శివరాజ్ కుమార్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని రాత్రి సమయాలలో కూడా షూటింగ్ జరుపుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే జాన్వి కూడా అందుకు సంబంధించి పలు విషయాలను కూడా వెల్లడించింది.

అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న కొత్త షెడ్యూల్లో శివరాజ్ కుమార్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. RC -16 చిత్రంలో రామ్ చరణ్ ఒక క్రీడాకారుగా కనిపించబోతున్నారని మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ క్రికెట్ ప్లేయర్గా కుస్తీ ఆటగాడుగా ఇలా పలు రకాల ఆటలు ఆడే యువకుడిగా కనిపించబోతున్నారట. రామ్ చరణ్ కిర్కెట్ మ్యాచ్కు సంబంధించి కొన్ని సన్నివేశాలు లీక్ అయినట్లుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. ఎవరో తన మొబైల్ లో RC -16 సంబంధించి క్రికెట్ షూటింగ్ జరుగుతున్న సన్నివేశాలని వీడియో తీస్తూ రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో  రామ్ చరణ్ మైదానంలో క్రికెట్ ఆడుతున్నట్టు కనిపిస్తున్నది.. ఈ వీడియో చూసిన అభిమానులు కూడా ఖుషి అవుతు ఈ వీడియోని పలు రకాలుగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరి ఈ వీడియో RC -16 కి సంబంధించిన వీడియోనా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో జగపతిబాబు తో పాటుగా చాలామంది నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండడం గమనార్హం. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: