
ప్యారడైజ్ కోసం తన తీరును మార్చుకున్న నారాయణ మూర్తి !
జూనియర్ ఎన్టీఆర్ తో పూరీ జగన్నాథ్ తీసిన ‘టెంపర్’ మూవీలో పోసాని కృష్ణ మురళి చేసిన పాత్రను మొదట్లో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆర్. నారాయణ మూర్తికి ఆఫర్ చేసి బ్లాంక్ చెక్ ఇవ్వడం జరిగింది అన్న వార్తలు కూడ వచ్చాయి. అయితే నారాయణ మూర్తి బయట దర్శకుడుతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేకపోవడంతో ఆ ఆఫర్ ను నారాయణ మూర్తి సున్నితంగా తిరస్కరించాడు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.
అలాంటి నారాయణ మూర్తి తన మనసును మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్యారడైజ్’ మూవీలో ఒక కీలక పాత్రను నారాయణ మూర్తి చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిణ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ లో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించడమే కాకుండా రెండు జడలతో నానీని చూపించిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక హీరో పాత్రను చాల డిఫరెంట్ గా వయోలెంట్ గా చూపించడం చాలమంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమూవీలో అత్యంత కీలకమైన తల్లి పాత్రను రమ్యకృష్ణ కు ఆఫర్ చేసినప్పటికీ ఆమె ఈపాత్రలో నటించడానికి తిరస్కరించింది అంటూ వార్తలు రావడంతో ఇప్పుడు నాని తల్లిగా నటించబోయే సీనియర్ ఆర్టిస్ట్ ఎవరు అంటూ చర్చలు కూడ జరుగుతున్నాయి. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘హిట్ 3’ మూవీ విడుదల అయ్యాకా ఈమూవీ షూటింగ్ వేగంగా పూర్తి చేసి ఆతరువాత అల్లు అర్జున్ ‘ప్యారడైజ్’ వైపు అడుగులు వేస్తాడు అని టాక్..