మరోసారి బయటపడ్డ అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ .. పై చేయి ఎవరిదంటే..?

frame మరోసారి బయటపడ్డ అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ .. పై చేయి ఎవరిదంటే..?

Amruth kumar
రీసెంట్గా గతంలో కొద్ది నెలల పాటు కంటిన్యూగా టాలీవుడ్లో మెగా అభిమానులు వర్సెస్  బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ నడిచిన  విషయం తెలిసిందే .. అటు పవన్ కళ్యాణ్ , ఇటు అల్లు అర్జున్ కూడా ఒకరిపై ఒకరు గట్టిగా విమర్శలు చేసుకున్నారు .. ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుల పరిస్థితి మారిపోయింది .. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేనకు మద్దతు ఇవ్వకుండా వైసీపీకి సపోర్ట్ చేయటం ఈ వివాదానికి అసలైన కారణంగా మారింది. ఇక దాంతో మెగా అభిమానులంతా బన్నీ ఇష్యూ పై మండిపడ్డారు .. అలాగే సోషల్ మీడియా వేదికగా పలు రకాలు విమర్శలు కూడా చేశారు .. పవన్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఎక్కడ కూడా పవన్ కలిసింది కూడా లేదు .. అయితే ఇప్పుడు అంతా సైలెంట్ గా మారిపోయింది .. అయితే గతంలో దాదాపు 15 ఏళ్ల‌ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చింది .  ఇదే విషయాన్ని అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు .

అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన అన్నవరం సినిమాకు అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో క్లాష్‌ వచ్చింది .. అయితే పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమా ముందు వచ్చింది .. కానీ ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది..  కానీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి .. అలా అన్నవరం రిలీజ్ అయిన రెండు మూడు వారాల తర్వాత దేశముదురు రిలీజ్ అయింది .. తొలి వారంలోని దేశముదురుకు డివైడ్ టాక్ వచ్చింది .. రెండు మూడు వారాలు వచ్చేసరికి పెద్ద హిట్ అని తెల్లిపోయింది .. అలాగే దేశముదురు కలెక్షన్లు కూడా బాగా పెరిగాయి. ఇక దీంతో ఆ సమయంలో రిలీజ్ అయిన మిగిలిన సినిమాలకు అన్నవరంతో సహా కలెక్షన్లు తగ్గిపోయాయి .. పవన్ అన్నవరం సినిమాకు రిపీటెడ్ ప్రేక్షకులు లేకుండా పోయింది ..

ఇక అప్పట్లో మెగా అభిమానులే ఆ కుటుంబాలకు చెందిన అందరు హీరోల సినిమాలను మానకొండ చూస్తూ ఉండేవారు .. అలాగే అల్లు అర్జున్ కు అప్పటికి సపరేట్గా అభిమానులు క్రెడిట్ కాలేదు .. అప్పుడప్పుడే ఆయన ఎదుగుతున్నారు దాంతో పవన్ , చిరంజీవి అభిమానులు అల్లు అర్జున్ సినిమాలు చూస్తూ ఉండేవారు .. సాధారణంగా రెండో సారి పవన్ కళ్యాణ్ సినిమా చూసే అలవాటు ఉన్న అభిమానులు కూడా దేశముదురు చూసి ఆగిపోయారు .. దేశముదురు హిట్  వల్ల అల్లు అర్జున్ స్టామినా పవన్ కళ్యాణ్ స్టామినాకంటే పెరిగిందని చెప్పలేకపోయినా అల్లు అర్జున్  నటన యువతను బాగా అల రించగలిగింది  .. బాక్సాఫీస్ దగ్గర అప్పుడు ఈ ఇద్దరు హీరోలు గట్టి పోటీపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: