రాజశేఖర్ నో చెప్పిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరు .. ఆ సినిమాలు ఎంతో స్పెషల్ ..?

frame రాజశేఖర్ నో చెప్పిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరు .. ఆ సినిమాలు ఎంతో స్పెషల్ ..?

RAMAKRISHNA S.S.
ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి విజయం సాధించడం ఎంతో కామన్ .. ఇక‌ గతంలో రాజశేఖర్ విషయంలో కూడా ఇదే ఒకసారి జరిగింది .. తాను చేయాల్సిన సినిమాని చిరంజీవి చేయాల్సి రావడం ఇక్కడ మరో విశేషం . అంతేకాకుండా ఆ సినిమాతో చిరంజీవి ఏకంగా ఇండస్ట్రీ హీట్ అందుకున్నారు .. ఇది ఒకసారి కాదు రెండుసార్లు రాజశేఖర్ కెరీర్ లో జరిగింది .. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇక్కడ చూద్దాం. టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ .. గ‌తంలో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో ఒకరిగా క్రేజ్ తెచ్చుకున్నారు .. కొని అనుకోని తప్పులు వల్ల ఆయన కెరియర్ పడిపోయింది .. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాలని ప్రయత్నిస్తున్నాడు ..

అయితే ఒకప్పుడు చిరంజీవి , బాలయ్యకు పోటిగా ఆయన సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి . ఆ క్రమంలో భారీ ఆఫర్స్ ఆయనకు వచ్చాయి .. ఆయనే వాటిని సరిగా వాడుకోలేకపోయారు. అయితే ఆక్రమంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ విజయాలను చేతులారా వదులుకున్నరు రాజశేఖర్ .. శంకర్ దర్శకత్వంలో జెంటిల్మాన్ ముందుగా రాజశేఖర్ చేయాల్సి ఉంది కానీ ఆయన వదులుకున్నారు .. అలాగే ఠాగూర్ సినిమాను కూడా ఆయనే చేయాల్సి ఉందట .. ముందు దర్శకులు రాజశేఖర్ ను కలిశారట .  కానీ డేట్స్ ఇష్యూ వల్ల ఆయన చేయలేకపోయారు . ఆ తర్వాత చిరంజీవి వద్దకు వెళ్ళింది ఆయన కేర్‌లోనే  బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది .. ఈ సినిమాతోనే చిరంజీవి తిరుగులేని మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు .. ఈ సినిమా తమిళంలో వచ్చిన రమణకి రీమేక్ .

అయితే ఒక విధంగా ఇదే రాజశేఖర్ కి గట్టి షాక్ అనే చెప్పాలి .. ఈ సినిమా ఆయన చేసి ఉంటే మరో స్థాయిలో ఉండే వారిని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు . ఆయన కెరియర్ కూడా మరోలా ఉండేది . వీటితో పాటు మరో సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది . చిరంజీవి చేసిన ఆరాధన కూడా మొదట రాజశేఖర్ వద్దకే వచ్చింది .. కానీ ఆయన నో చెప్పాడు .. అయితే ఆ తర్వాత ప్రధాన పాత్రలో పులిరాజా గా రాజశేఖర్ ని అడిగాడు ఆయన చేయనున్నారు .. కానీ మరో పాత్రలో రాజశేఖర్ కనిపించారు .. అలా రాజశేఖర్ నో చెప్పడం తో పులిరాజు పాత్రకి చిరంజీవి ఓకే చెప్పారు .. ఇక ఈ సినిమాతో చిరంజీవికి నటుడుగా మంచి గుర్తింపు కూడా వచ్చింది ..  ఈ సినిమా కూడా తమిళ రీమేక్ ఏ .. ఇలా ఈ రెండు సినిమాల విషయంలో రాజశేఖర్ చేసిన తప్పుడు నిర్ణయాల కారణంగా ఆయన కెరియర్ పై గట్టి ప్రభావాన్ని చూపించాయని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: