మహిళా దినోత్సవ సందర్భంగా మెగా ఫ్యామిలీ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగబాబు తో పాటు ఆయన తల్లి అంజనాదేవి ఆయన సిస్టర్స్ విజయదుర్గ, మాధవి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసులో తాను ఎక్కువగా పని చేసే వాడిని కాదని అన్నారు. అన్ని పనులు చిరంజీవి చూసుకునే వారని చెప్పారు. అప్పుడప్పుడు తన అన్న చేతిలో దెబ్బలు కూడా పడ్డాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. మా తమ్ముడు పవన్ కళ్యాణ్ చాలా వీక్ గా ఉండేవాడని అన్నారు.
అందుకే అమ్మ పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగా కేర్ చూపించేదని అన్నారు. ఇప్పటికీ కళ్యాణ్ బాబు వస్తున్నాడు అంటే ఇష్టమైన వంటకాలన్నీ వడ్డిస్తుంటారని తెలిపారు. తిండి విషయంలో అన్నయ్య ఏం పెట్టినా సైలెంట్ గా తినేవారని కానీ తాను మాత్రం ఇంట్లో అల్లరి చేసే వాడిని అని చెప్పారు. కళ్యాణ్ బాబు అయితే నచ్చితే తింటాడు లేదంటే సైలెంట్ గా వెళ్ళిపోతాడని అన్నారు. సైలెంట్ గానే కళ్యాణ్ బాబు నిరసన తెలిపే వాడని వెల్లడించారు.
అంతేకాకుండా తనకు ఎన్ని బాధలు ఉన్నా తల్లిని హగ్ చేసుకుంటే అవన్నీ మాయమైపోతాయని చెప్పారు. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో ఉన్నట్టుగా తన తల్లి దగ్గర ఆ శక్తి ఉంటుందని చెప్పారు. అమ్మని హగ్ చేసుకుంటే ఎక్కడా లేని ఎనర్జీ వస్తుందని అన్నారు. చిరంజీవి చిన్ననాటి నుండి ఎక్కువ కష్టపడ్డాడని అంజనా దేవి అన్నారు. ఇంటి పనుల్లో సాయం చేసేవాడని తెలిపారు. ఇంటా బయట పనులు చేసేవాడని చెప్పారు. అందరూ కలిసి ఉండాలని అందరితో ప్రేమగా ఉండాలని అన్నారు. కుటుంబం కుటుంబంలానే ఉండాలని చెప్పారు. అది తన పిల్లలకు నేర్పించానని చెప్పారు. కానీ ఇప్పుడు అంతగా ప్రేమలు కనిపించడం లేదని ఉమ్మడి కుటుంబాలు లేవని అందరూ కలిసిమెలిసి ప్రేమతో ఉండాలని అన్నారు.