
' ఛావా ' 2 డేస్ కలెక్షన్లు.. టాలీవుడ్‌లోనూ కుమ్ముడేగా.. !
బాలీవుడ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా “ ఛావా ” లేటెస్ట్ గా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఇంకా చెప్పాలి అంటే గత రెండేళ్లు గా సరైన హిట్ లేక విలవిల్లా డుతున్న బాలీవుడ్ సినిమాకు ఛావా కాస్త ఊపిరి లూదింది అని చెప్పాలి. ఇక ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రు. 500 కోట్ల వసూళ్లకు చేరువలో ఉన్న ఛావా తెలుగు లోనూ రిలీజ్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి తో వెయిట్ చేశారు. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరో గా .. కన్నడ కస్తూరి రష్మిక మందన్నా హీరోయిన్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.
ఇక ఈ సినిమా ఇప్పటికే రు. 500 కోట్ల వసూళ్లు అందుకోవడం తో తెలుగులో కూడా మంచి డిమాండ్ .. క్రేజ్ మధ్య రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో నే ఛావా తెలుగు వెర్షన్ కు మొదటి రోజు 3 కోట్ల గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. ఈ క్రమం లోనే ఛావా రెండో రోజు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తాజా పీఆర్ లెక్కల ప్రకారం ఛావా సినిమా తెలుగులో రెండో రోజు 3.8 కోట్లకి పైగా గ్రాస్ అందుకుంది.
దీంతో రెండు రోజుల్లో ఛావా తెలుగు వరకు చూసుకుంటే రు . 6.8 కోట్లకి పైగా గ్రాస్ అందుకుంది. ఇక ఈ ఆదివారం కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనపరుస్తుందని బుకింగ్స్ చెపుతున్నాయి. ఆదివారం కంప్లీట్ అయ్యే సరికి ఛావా ఇక్కడ రు. 10 - 11 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేశారు.