నాగార్జున - పూరి జగన్నాథ్ శివమణి 2 ... !
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొంత కాలంగా సరైన ఫామ్ లో లేడు. ఒకప్పుడు స్టార్ హీరోలకు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన పూరి కి చివరగా జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ సినిమా హిట్. ఆ తర్వాత రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యింది. మధ్యలో కనీసం 10 కు పైగా సినిమాలు ఘోరమైన డిజాస్టర్లు అయ్యాయి. ఇక చివరి గా చేసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు.
ఈ రెండు డిజాస్టర్ల తర్వాత పూరి తో సినిమా చేసేందుకు ఎవ్వరూ రావడం లేదు. అయితే తాజా అప్ డేట్ ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో . . కింగ్ నాగార్జున కు పూరి ఓ కథ వినిపించబోతునట్లు టాక్ ? వీరిద్దరి కాంబోలో గతంలో సూపర్ - శివమణి అనే రెండు సినిమాలు వచ్చాయి. ఆ సినిమా లు మంచి హిట్ అయ్యాయి. మళ్లీ ఇన్నేళ్లకు ఇప్పుడు వీరి కాంబినేషన్ లో సినిమా అంటే సహజంగానే ఆసక్తి కలుగుతోంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని హీరోగా వచ్చిన “ డబుల్ ఇస్మార్ట్ ” సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఇక పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యిందన్న విమర్శలు వచ్చాయి. మరి ఈ క్రమంలో నే పూరి , నాగార్జున కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి. ఈ సారి వీరి కాంబోలో వచ్చే సినిమా శివమణి 2 అన్న రేంజ్ లో ఉండాలన్న కామెంట్లు పడుతున్నాయి.