ఈమధ్య కోర్ట్ డ్రామా సినిమాలకు క్రేజ్ పెరిగింది. జై భీమ్ సినిమా తర్వాత కోర్ట్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. లా.. లో ఉండే లొసుగులు, కోర్టుల్లో కేసులు వాదించే తీరు, కేసుల నుండి ఎలా తప్పించుకోవచ్చు.. ఇలా అనేక రకాల కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా తెలుగులో మరో కోర్ట్ డ్రామా సినిమాగా తెరకెక్కింది. ఆ సినిమా పేరే కోర్ట్ ఈ చిత్రంలో సీనియర్ హీరో శివాజీ ముఖ్యమైన పాత్రలో నటించారు. అదేవిధంగా ప్రియదర్శి సైతం కీ రోల్ లో నటించారు. మార్చి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
2 నిమిషాల 57 సెకండ్ల ఉన్న ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాకు మరో హైలెట్ చిత్రాన్ని హీరో నాని నిర్మించడమే. టైలర్ చూస్తే ఓ నిజమైన కథను తెరపై చూపించినట్టుగా కనిపిస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించినందుకు కుర్రాడిపై అమ్మాయి తండ్రి కక్ష కట్టి ఫోక్స్ తో పాటు పలు కఠినమైన శిక్షలతో కేసులు పెట్టిస్తాడు. ఆ తర్వాత అతన్ని 70 రోజులకు పైగా పోలీస్ స్టేషన్లో పెట్టి వేధిస్తారు. ఇది తెలుసుకున్న యంగ్ లాయర్ ప్రియదర్శి పిల్లాడు నిర్దోషి అని ఎలా నిరూపించాడు.
దానికి ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేదే సినిమా కథ. సినిమా ట్రైలర్ చూస్తే తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సినిమా నాంది, తమిళ్ లో సూపర్ గా నిలిచిన జై భీమ్ లాంటి సినిమాలు గుర్తుకు వచ్చాయి. ఈ సినిమా కూడా జై భీమ్ రేంజ్ లో హిట్ అవుతుందా అన్న ఆసక్తి నెలకొంది. సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేయడంతో ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల నడుమ ఈనెల 24 విడుదలవుతున్న సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.