ఎన్నో సంవత్సరాల పాటు తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో త్రిష ఒకరు. ఈ ముద్దు గుమ్మ పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఈ తరం స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి , వెంకటేష్ , బాలకృష్ణ లాంటి అలనాటి స్టార్ హీరోలతో కూడా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించింది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ ఇప్పటికీ కూడా అద్భుతమైన జోష్లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.
ఓ వైపు వరస పెట్టి తమిళ సినిమాలో నటిస్తూనే మరో వైపు అడపా దడపా ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తోంది. ఇకపోతే ఈ బ్యూటీకి ఇప్పటికీ కూడా అద్భుతమైన క్రేజ్ ఉండడంతో ఈమె ఒక్కో సినిమాకు పెద్ద మొత్తంలో పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం త్రిష ఒక్కో మూవీ కి 10 నుండి 12 కోట్ల వరకు పారితోషకం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రిష , మెగాస్టార్ చిరంజీవి హీరో గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ మూవీ కోసం ఈ బ్యూటీ ఏకంగా 12 కోట్ల పారితోషకం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే మళ్లీ త్రిష క్రేజ్ తెలుగులో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.